Women's ODI World Cup 2025: జట్టు విజయం కోసం సెంచరీ త్యాగం.. నిస్వార్థమైన ఆటకు కేరాఫ్‌గా ఆస్ట్రేలియా

Women's ODI World Cup 2025: జట్టు విజయం కోసం సెంచరీ త్యాగం.. నిస్వార్థమైన ఆటకు కేరాఫ్‌గా ఆస్ట్రేలియా

క్రికెట్ లో సెంచరీ అంటే ఏ ప్లేయర్ కైనా ప్రత్యేకమే. సెంచరీ చేసేందుకు అవకాశం ఉన్నా వదులుకువాలంటే అది ఆసీస్ క్రికెటర్లకే చెల్లుతుందేమో. మైల్ స్టోన్స్ కంటే జట్టు విజయమే ముఖ్యమనుకునే జట్టుగా ఆస్ట్రేలియాకు పేరుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మరోసారి నిరూపించింది. మహిళా వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ ఛేజింగ్ లో అద్భుతంగా ఆడింది. 98 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తనకు సెంచరీ చేసుకునే అవకాశం వచ్చింది.

అప్పటికీ 41 ఓవర్ కావడంతో సెంచరీ చేసుకుంటుందని భావించారు. సదర్లాండ్ సెంచరీ చేసుకునే అవకాశం ఉన్నా ఆసక్తి చూపించలేదు. నెట్ రన్ రేట్ కోసం నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న గార్డనర్ ను ఫినిష్ చేయమని చెప్పింది. గార్డనర్ ఫోర్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేయడంతో సదర్లాండ్ 98 పరుగుల వద్దనే ఆగిపోయింది. జట్టు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందని.. నా సెంచరీ మిస్ అయినందుకు బాధగా లేదని చెప్పుకొచ్చింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో గార్డనర్, సదర్లాండ్ కలిసి ఏకంగా 184 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

విమెన్స్ వరల్డ్ కప్‌‌లో ఆస్ట్రేలియా అజేయ జైత్రయాత్ర:

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆష్లే గార్డ్‌‌నర్ (104 నాటౌట్‌‌) సెంచరీకి తోడు అనాబెల్ సదర్లాండ్ (98 నాటౌట్; 3/60) ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌తో ఆకట్టుకోవడంతో ఆస్ట్రేలియా ఈ మెగా టోర్నీలో  ఐదో  విజయం సాధించింది. సౌతాఫ్రికాను వెనక్కునెట్టి తిరిగి టాప్ ప్లేస్‌‌ సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌‌లో ఆసీస్‌‌  6  వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌ను చిత్తుగా ఓడించింది.  తొలుత ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 244/9  స్కోరు మాత్రమే చేసింది. టామీ బ్యూమోంట్ (78) సత్తా చాటింది. 

ఆసీస్ సీమర్ సదర్లాండ్ మూడు వికెట్లతో దెబ్బకొట్టగా.. స్పిన్నర్లు సోఫీ మోలినుక్స్ (2/52), అలానా కింగ్ (1/20) కట్టుదిట్టమైన బౌలింగ్‌‌తో రన్స్ నియంత్రించారు. అనంతరం ఆసీస్ 40.3 ఓవర్లలోనే 248/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. స్టార్టింగ్‌‌లో లిచ్‌‌ఫీల్డ్ (1), జార్జియా వోల్‌‌ (6), ఎలీస్ పెర్రీ (13), బెత్‌‌ మూనీ (20) ఫెయిలవడంతో కంగారూ టీమ్ ఓ దశలో 68/4తో ఇబ్బందుల్లో పడింది. కానీ,  గార్డ్‌‌నర్‌‌‌‌, సదర్లాండ్ ఐదో వికెట్‌‌కు అజేయంగా 180 రన్స్ భారీ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌తో జట్టును గెలిపించారు. సదర్లాండ్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

►ALSO READ | IND vs AUS: బుమ్రా ఇన్.. నితీష్ ఔట్: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

చివరి లీగ్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించి టేబుల్ టాపర్ గా సెమీస్ లో అడుగుపెట్టింది. గురువారం (అక్టోబర్ 30) ఇండియాతో సెమీ ఫైనల్లో తలపడనుంది. ఆస్ట్రేలియా (13) ఆడిన అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించి  పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ (11), సౌతాఫ్రికా (10), ఇండియా (7) వరుసగా  రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బుధవారం (అక్టోబర్ 29) జరుగుతుంది.