
భీమదేవరపల్లి, వెలుగు : వచ్చే ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి సీపీఐ పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో శనివారం ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వారిని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గుర్తించకపోవడం సరికాదన్నారు. ధరణి పోర్టల్‌పై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ తెలంగాణలో ఆ పార్టీ నాయకుల మధ్య కో ఆర్డినేషన్ లేదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్నారని, అందుకే ఇక్కడ బరిలో ఉండేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.