కమాండోలు ఉండగా నడ్డాపై దాడి ఎలా జరుగుతుంది?

కమాండోలు ఉండగా నడ్డాపై దాడి ఎలా జరుగుతుంది?

కోల్‌‌కతా: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా బెంగాల్ పర్యటన వివాదాస్పదం అయ్యింది. గురువారం ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌‌పై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. కోల్‌‌కతాలోని డైమండ్ హార్బర్‌‌కు వెళ్తుండగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలుగా అనుమానిస్తున్న వారు రహదారిని నిర్బంధించి నడ్డా కాన్వాయ్‌‌ను అడ్డుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఈ దాడికి దిగారని బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ ఆరోపించారు. తాజాగా ఈ విషయం పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.

సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ లాంటి కేంద్ర బలగాల కమాండోలు, పకడ్బందీ రక్షణ నడ్డాను దాడికి గురి కాకుండా ఎందుకు కాపాడలేకపోయాయని మమత ప్రశ్నించారు. కమాండోలు ఉండగా దాడి చేసిన వారు నేతల కార్లను ఎలా ముట్టుకుంటారని క్వశ్చన్ చేశారు. ఈ దాడి ప్లాన్ చేసిందని తాను భావించడం లేదని, బీజేపీ మీద ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఇలా బయటపడి ఉండొచ్చునన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని, బీజేపీ అబద్ధాలను సహించేది లేదని తెలిపారు.