చంద్రబాబు కాళ్లు మొక్కుతుంటే.. జగన్ వంగి దండాలు పెడుతున్నాడు : షర్మిల

చంద్రబాబు కాళ్లు మొక్కుతుంటే.. జగన్ వంగి దండాలు పెడుతున్నాడు : షర్మిల

ఏపీ సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు పై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. - బాబు వెళ్లి బీజేపీ వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారని- జగన్ వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే బాబు,జగన్ దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు. తుని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాబు అమరావతి పేరు చెప్పి 3D గ్రాఫిక్స్ చూపించారని జగన్  వచ్చి  మూడు రాజధానులు అని కాలయాపన చేశాడని చివరకు ఏది లేకుండా పోయిందని అన్నారు.

ఈ 10 ఏళ్లలో రాష్ట్రంలో చెప్పుకునే అభివృద్ధి లేదని అన్నారు.- రాష్ట్ర హక్కులు బీజేపీ కాలరాస్తుంటే వైసీపీ భజన చేస్తుందని విమర్శించారు.  అసెంబ్లీలో నిలబడి బీజేపీతో సఖ్యత ఉందని చెప్పుకుంటున్నారని తెలిపారు.  రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని షర్మిల ఆరోపించారు.   ప్రత్యేక ప్యాకేజీలు ఎక్కడా అని ప్రశ్నించారు.  కలలు కంటూ అవే నిజాలు అని అసెంబ్లీలో నిలబడి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. - కేంద్రం మనకు రూ.10 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉందని నిధులు ఎక్కడ వచ్చాయో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగులు,  రైతుల పై జగన్ కు చిత్తశుద్ది లేదని అన్నారు. వైఎస్సార్ ఆశయాలు ఎక్కడ అమలు కావడం లేదన్నారు. రాష్ట్రాన్ని  రూ. 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని అన్నారు. ఎక్కడ గొంగళి అక్కడే ఉన్నట్లుందని షర్మిల అన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండని ఇసుక మాఫియా ద్వారా దోచుకున్న డబ్బే అది అని అన్నారు. ఆ డబ్బు తీసుకొని ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.