దెబ్బ మీద దెబ్బ : చంద్రబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

దెబ్బ మీద దెబ్బ : చంద్రబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ.. ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటీషన్లు కొట్టివేసిన కొన్ని గంటలకే.. మరో షాకింగ్ న్యూస్. విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సైతం కొట్టివేసింది న్యాయస్థానం. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వటానికి కుదరదని స్పష్టం చేసింది కోర్టు. ఇదే సమయంలో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ సైతం కొట్టివేసింది కోర్టు. 2023, అక్టోబర్ 9వ తేదీ ఉదయం నుంచి ఈ రెండు పిటిషన్లపై వాదనలు జరిగాయి. ఆ తర్వాత కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

సీఐడీ కస్టడి పిటిషన్ కొట్టివేత

 స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో  చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్‌ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్‌లను డిస్మిస్‌ చేసింది.