ఎన్టీఆర్ పేరు అంటేనే చంద్రబాబుకు నచ్చదు

ఎన్టీఆర్ పేరు అంటేనే చంద్రబాబుకు నచ్చదు

ఎన్టీఆర్ పేరు అంటేనే చంద్రబాబుకు నచ్చదన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి  ఆర్కే రోజా.  అందుకే ఎన్టీఆర్ విగ్రహాలను ఎక్కడా పెట్టలేదన్నారు. ఇవాళ ఉదయమే ఇవాళ ఉదయం బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ మంత్రి రోజా.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్సం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని.. జగన్ లాంటి మంచి సీఎంను ఎన్నడూ చూడలేదని ప్రజలు చెప్తున్నారని తెలిపారు. వైసీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని, రాష్ట్రానికి, తెలుగు దేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబే అని ఆనాడు ఎన్టీఆర్ అన్నారని ఆమె గుర్తు చేశారు. 

జూనియర్ ఎన్టీఆర్ తో..తన కొడుక్కి ముప్పు ఉందనే పార్టీకి దూరం పెట్టారని, అలాగే తన దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టుకున్నాడన్నారు. వాళ్లు అడిగిన విధంగానే కొనసీమకు అంబేద్కర్ పేరు పెడితే.. టీడీపీ, జనసేన నాయకులే విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. పోలీసులు దెబ్బలు తిన్నా కూడా సంయమనం పాటించి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారని.. ఈ కుట్ర వెనుకాల ఎవరు ఉన్న...కచ్చితంగా ఎవరిని వదిలి పెట్టేదే లేదని మంత్రి రోజా హెచ్చరించారు.  14 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిది... సీఎం జగన్ చేసి చూపించారని, ఎన్ని అబద్దాలు చెప్పినా, మహానాడు పెట్టి మహిళలతో తిట్టించినా టీడీపీని  ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి రోజా పేర్కొన్నారు. 

 

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ వెన్నుపోటులేని రాజకీయాలు చేశారు

నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణ నివాళులు

పెళ్లి మంటపానికి ట్రాక్టర్ నడుపుతూ వచ్చిన వధువు