పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు.. అసెంబ్లీ ఎన్నికలపై చర్చ!

పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు.. అసెంబ్లీ ఎన్నికలపై చర్చ!

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో చంద్రబాబు.. మాదాపూర్ లోని పవన్ నివాసానికి వెళ్లి కలిశారు. ఏపీలో మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీలో రాజకీయ పరిణామాలు, ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో రూపకల్పన, ఎన్నికల ప్రచార వ్యూహాలపై పవన్ తో చంద్రబాబు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

వీరి భేటీపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. పవన్, చంద్రబాబు భేటీపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఇల్లు లేని వారు.. ఎవరి ఇంటికి ఎవరు వెళ్లినా చివరకు అక్కడే స్థిరపడతారంటూ సెటైర్ వేశారు మంత్రి అంబటి.