కోర్టులోనే చంద్రబాబుకు వైద్య పరీక్షలు..

కోర్టులోనే చంద్రబాబుకు వైద్య పరీక్షలు..

పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సిట్ కార్యాలయం నుంచి నేరుగా చంద్రబాబును ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లనున్నారు. కోర్టులోనే వైద్యపరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.  అంబులెన్స్ లోనే   చంద్రబాబుకు పరీక్షలు చేసేందుకు వైద్యులు అన్ని పరికరాలు సిద్ధం చేశారు. మరో వైపు కాసేపట్లో చంద్రబాబు లాయర్లు  జడ్జిని కలవనున్నారు. డీలే ఆఫ్ ప్రొడ్యూస్ పై హౌస్ మోషన్  వేయనున్నారు.

స్కిల్ డెవ్ లమెంట్ స్కీంలో గోల్ మాల్ జరిగిందంటూ  చంద్రబాబును సెప్టెంబర్ 9న ఉదయం అరెస్ట్ చేశారు. విజయవాడలోని సిట్ ఆఫీస్ కు తరలించిన సీఐడీ అధికారులు..  దాదాపు ఐదున్నర గంటలుగా చంద్రబాబును విచారిస్తున్నారు. చంద్రబాబుకు సీఐడీ 20 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.  అయితే చంద్రబాబు సీఐడీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది.