
రాఘవ లారెన్స్(Raghava Lawrence) మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ చంద్రముఖి 2(Chandramukhi 2). పి వాసు(p Vasu) డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా కంగనా రనౌత్(Kangana Ranaut) ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. లాస్య విలసిత..నవనాట్య దేవత..నటనాంకిత అభినయ వ్రత చారు వీర చరిత.. అంటూ ప్రతిధ్వనించే స్వాగతాంజలి కీర్తనలా ఉండే సాంగ్ రిలీజ్ చేశారు.
ఇందులో కంగనా అందం..అభినయం..నాట్య ప్రదర్శన..ప్రతి ఒక్కరు అసూయ పడే అంతా అందంగా ఉంది. జనన..జననలో పోరాడి..స్వాగతాంజలి.. కంగనా నాట్యం చేస్తూ..అచ్చం యువరాణిలా ఉంది. ఇక లిరిక్స్ లో..పదము పదముగా..హృదయ లయలుగా అంటూ చైతన్య ప్రసాద్ రాసిన ఈ గీతం అచ్చ తెలుగు మధురానుభూతిని ఇస్తోంది. శ్రీనిధి తిరుమల తన ఇంటెన్సివ్ వాయిస్ తో అద్భుతంగా పాడారు. ఇక ఎం ఎం కీరవాణి(Keeravani) అందించిన మ్యూజిక్ మరోసారి తనలోని మ్యాజిక్ తో హృదయాలను టచ్ చేశారు. ఎంతో వినసొంపుగా ఉన్న ఈ గీతం శ్రోతలను అలరిస్తుంది. దీంతో చంద్రముఖి 2 పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. స్వాగతాంజలి అంటూ..ఈ ఫస్ట్ సింగల్ తోనే అందరినీ చంద్రముఖి లోకంలోకి తీసుకెళ్లారు మేకర్స్.
ఇప్పటికే రిలీజైన లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యాయి. లారెన్స్ రాజు గెటప్ లో.. రాజసం ఉట్టిపడేలా లుక్స్, మ్యానరిజమ్స్ తో ఆకట్టుకున్నారు. దాదాపు 17ఏళ్ల తర్వాత చంద్రముఖి మూవీకు సీక్వెల్ తెరకెక్కుతుండటం విశేషం. గణేష్ చతుర్థి సందర్భంగా ఈ సినిమాను 2023 సెప్టెంబర్ 19న రిలీజ్ చేయనున్నారు.
తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కంగనా రనౌత్, వడివేలు, రాధిక శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.