చంద్రముఖి2 వచ్చేస్తోంది.. ఇక బాక్సాఫీస్ వేట మొదలు!

చంద్రముఖి2 వచ్చేస్తోంది.. ఇక బాక్సాఫీస్ వేట మొదలు!

సూపర్ స్టార్  రజనీకాంత్(Rajinikanth) హీరోగా వచ్చిన చంద్రముఖి(Chandramukhi) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ రోజుల్లో ఈ సినిమా సృష్టించిన సంచలణాలు అన్నీ ఇన్నీ కాదు. హార్రర్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల వెన్నులో వణుకుపుట్టించింది. బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా.

ఇక దాదాపు పద్దేన్మిది సంవత్సరాల తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి2(Chandramukhi2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాఘవ లారెన్స్(Raghava Lawrence) హీరోగా నటిస్తున్నాడు. చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్(Kangana Ranaut) నటిస్తోంది. అనౌన్స్ మెంట్ తోనే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. ఈ మేరకు లేటెస్ట్ అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. చంద్రముఖి పార్ట్1 ను తెరకెక్కించిన పి వాసు(P Vasu) నే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. 

ప్రస్తతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటిపార్ట్ లాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు.. ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తుందని చిత్ర యూనిట్ నుండి వినిపిస్తున్న మాట. మరి రిలీజ్ తరువాత ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను రాబడుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.