మహిళా శక్తి సమ్మేళనాలు నిర్వహించాలె : చంద్రశేఖర్ తివారి

మహిళా శక్తి సమ్మేళనాలు నిర్వహించాలె : చంద్రశేఖర్  తివారి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాల్లో మహిళా శక్తి సమ్మేళనాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్  సెక్రటరీ చంద్రశేఖర్  తివారీ కోరారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్  శిల్పారెడ్డి అధ్యక్షతన మహిళా మోర్చా పదాధికారుల సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా చంద్రశేఖర్  తివారి మాట్లాడుతూ.. ప్రతి మండల, డివిజన్  స్థాయిలో మహిళా స్పెల్ఫ్ హెల్ప్  గ్రూప్స్, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ టీచర్లతో  మహిళా సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మహిళా మోర్చా జాతీయ నాయకురాలు పద్మ వీరపనేని తదితరులు హాజరయ్యారు.