చండ్రుగొండ, వెలుగు : కుష్టు వ్యాధి నివారణకు అవగాహనే ముఖ్యమని డిస్ట్రిక్ట్ పారా మెడికల్ ఆఫీషర్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో కుష్టువ్యాధి లక్షణాలు ఉన్న 24 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ వ్యక్తికైనా శరీరంపై నొప్పి లేకుండా పుట్టమచ్చలు, మచ్చలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలన్నారు.
కుష్టు వ్యాధికి తగిన మందులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, మంచి ఆహార నియమాలు పాటిస్తూ, మందులు క్రమ తప్పకుండా వాడితే నివారణ సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడాకల్ఆఫీసర్ వెంకటప్రకాశ్, సిబ్బంది పూర్ణరావు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
