రెవెన్యూ డివిజన్ గా చండూరు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

రెవెన్యూ డివిజన్ గా చండూరు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

నల్లగొండ: చండూరు ప్రజల కల నెరవేరింది. ఉపఎన్నికలో ప్రజలకిచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు.  చండూరు బహిరంగ సభలో ప్రకటించినట్లుగానే చండూరు ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారు.. ఈమేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చండూరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మిగతా హామీలు కూడా నెరవేర్చాలని చండూరు ప్రజలు కోరుతున్నారు. 

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పలు హామీలను ఇచ్చారు.. వాటిలో చండూరును రెవెన్యూ డివిజన్ గా చేస్తామని ప్రకటించారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు.. ఉపఎన్నికసందర్భంగా మునుగోడులో 100 పడకల ఆస్పత్రి, చండూరు మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ. 30కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.. నియోజకవర్గంలో కొత్తగా 5 సబ్ స్టేషన్లు కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సంస్థాన్ నారాయణపురంలో గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.. 

కాగా మునుగోడు ఉప ఎన్నిక సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలను నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.