నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే సహించను : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే సహించను : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చౌటుప్పల్ వెలుగు: ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే సహించనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మండలంలోని దామరలో రూ.26 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. 

దాని గోడలకు బీటలువారడంతో  కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రెనోవేషన్ చేయాలని ఆదేశించారు. అనంతరం రూ.3.25 కోట్లతో నిర్మించనున్న చౌటుప్పల్ లో కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. తన క్యాంప్​ఆఫీస్​లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్​పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, మున్సిపల్​మాజీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపల్​అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్ పాల్గొన్నారు.

సీతారామచంద్ర స్వామి ఆలయంలో పూజలు

చండూరు(నాంపల్లి), వెలుగు: నాంపల్లి మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ స్థిర ప్రతిష్ఠ ఉత్సవాలకు శుక్రవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నాంపల్లి మాజీ జడ్పీటీసీ ఏవీ.రెడ్డి తల్లి నరసమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా పసునూరులో ఆయనను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నాయకులున్నారు.