వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యం చేయొద్దు : కుంభం అనిల్ కుమార్ రెడ్డి

వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యం చేయొద్దు : కుంభం అనిల్ కుమార్ రెడ్డి
  • భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి, వెలుగు: వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. వలిగొండ మండలం వెలివర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కొనుగోళ్లను స్పీడప్ చేసి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. లారీల కొరత లేకుండా చూస్తూ కాంటా అయిన వెంటనే వడ్లను మిల్లులకు తరలించాలని సూచించారు.

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

వలిగొండ రైతు వేదికలో 67 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 27 మందికి సీఎంఆర్​ఎఫ్​చెక్కులను ఎమ్మెల్యే అనిల్​కుమార్​రెడ్డి పంపిణీ చేశారు.  సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం హరికృష్ణ, జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి తదితరులున్నారు.