
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
- నాంపల్లి పీఏసీఎస్ సెంటర్నిర్వాహకులపై ఆగ్రహం
చండూరు(నాంపల్లి), వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో దళారులను ప్రోత్సహిస్తే అధికారులను సస్పెండ్ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రైతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. నాంపల్లి పీఏసీఎస్, పెద్దాపురం ఐకేపీ సెంటర్లను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు.
నాంపల్లి సెంటర్ నిర్వాహకులు ధాన్యం కొనడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, దళారులకు ప్రాధాన్యం ఇస్తున్నారని రైతులు కలెక్టర్కు తెలిపారు. స్పందించిన ఆమె సెంటర్నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దాపురం కేంద్రంలో ఏమైనా సమస్యలున్నాయా అని రైతులను ప్రశ్నించగా లేవని చెప్పారు. దీంతో సెంటర్ఇన్చార్జి ఇందిరను అభినందించారు. ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్దేవసింగ్ తదితరులున్నారు.