కల్వకుర్తి, వెలుగు : రిజిస్టర్ చేసుకున్న భూముల డాక్యుమెంట్లను యజమానికి ఇవ్వడానికి రూ.లక్ష డిమాండ్ చేసిన నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ తహసీల్దార్ నాగమణి శుక్రవారం ఏసీబీకి చిక్కింది. ఏసీబీ కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలానికి చెందిన తాళ్ల రవీందర్ మాతృభూమి డెవలపర్స్ సంస్థ తరఫున చారకొండ మండలం సేరి అప్పారెడ్డిపల్లిలో 12 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నాడు. దానిని 12 మందికి ఎకరం చొప్పున అమ్మాడు. కొన్నవాళ్ల వారి పేరున రిజిస్ట్రేషన్ చేయడం కోసం చారకొండ తహసీల్దార్ నాగమణి కలిశాడు. ఆమె ఒక్కో డాక్యుమెంట్ కు రూ.25 వేల చొప్పున రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేసింది. బతిమిలాడినా డాక్యుమెంట్ ఇవ్వకుండా రెండు నెలలుగా తిప్పుకుంటోంది. దీంతో విసిగిపోయిన బాధితుడు రవీందర్ మహబూబ్నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం రూ.లక్ష ఇవ్వడానికి చారకొండ తహసీల్దార్ఆఫీసుకు వెళ్లాడు. రూ.75 వేలను వీఆర్వో భర్త వెంకటయ్యకు ఇచ్చి, మిగతా రూ.25 వేలు ఆపరేటర్ రాజుకు ఇవ్వాలని తహసీల్దార్ నాగమణి చెప్పారు. ఆమె చెప్పినట్టుగానే వారికి డబ్బులు ఇచ్చిన తర్వాత ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తన సిబ్బందితో రైడ్చేసి తహసీల్దార్నాగమణి, ఆపరేటర్ రాజు, వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శనివారం నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నట్టు డీఎస్పీ తెలిపారు. మరోవైపు జడ్చర్లలోని తహసీల్దార్ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది.
ఏసీబీ వలలో చారగొండ తహసీల్దార్
- మహబూబ్ నగర్
- April 29, 2023
లేటెస్ట్
- అమెరికాలో రాహుల్ కు గ్రాండ్ వెల్కమ్...
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పడి ఇద్దరు గల్లంతు
- మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం: మంత్రి పొంగులేటి
- ఖమ్మం కార్పొరేషన్ లో కూల్చివేతలు షురూ..
- హైడ్రా ఒక పబ్లిసిటీ స్టంట్.. హైడ్రా గుట్టును త్వరలోనే బయట పెడ్తాం: సబితాఇంద్రారెడ్డి
- Duleep Trophy 2024: 20 ఏళ్ళ ధోనీ రికార్డ్ సమం చేసిన జురెల్
- కానిస్టేబుల్ని కిడ్నాప్ చేసిన బీజేపీ నేత..అఖిలేష్ యాదవ్ వీడియో వైరల్
- నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు వరద పోటు.. ఐదు గేట్లు ఎత్తివేత
- Beauty tips: బంగాళదుంపతో ఫేస్ మారిపోద్ది..ఎలాగంటే...
- యూట్యూబ్ ఛానెల్ పెట్టుడు..ప్రతి ఒకడు జర్నలిస్ట్ అనుడు: సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో... జైలర్ సినిమా విలన్ వినాయకన్ అరెస్ట్
- హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో 100 పోస్టులకు నోటిఫికేషన్..
- దువ్వాడ వివాదంలో బిగ్ ట్విస్ట్.. అది ఏంటంటే..
- Murali mohan :హైడ్రా అవసరం లేదు.. ఆ రేకుల షెడ్ నేనే కూల్చేస్తా : మురళి మోహన్
- ఆధార్ అంత ఈజీ కాదు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి...
- అనితక్కా... ఏందిదీ.. హోం మంత్రి అనితపై మాధవీలత ఫైర్..
- దుండిగల్, మల్లంపేట విల్లాలు కూల్చివేస్తున్న హైడ్రా
- 40 యేళ్లలో ఒకేఒక్కడు..ఆ రాజకుటుంబంలో 18 యేళ్లు నిండిన ప్రిన్స్
- మాదాపూర్, మల్లంపేట్లో విల్లాలు, షెడ్లు మటాష్ : హైడ్రా కూల్చివేతలు.. తగ్గేదే లేదు