డాక్టర్లకంటే AI చాట్‌బాట్‌లు తెలివైనవా?..ఆరోగ్య సంరక్షణలో AI వెనుక అసలు నిజం ఏంటీ?

డాక్టర్లకంటే AI చాట్‌బాట్‌లు తెలివైనవా?..ఆరోగ్య సంరక్షణలో AI వెనుక అసలు నిజం ఏంటీ?

2024 చివరలో అమెరికాలోని ప్రముఖపత్రిక ది వాషింగ్టన్ పోస్ట్.. వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పై ఆసక్తికరమైన కథనం ప్రచురించింది. ఈ కథనంలో పాఠకులను వైద్యరంగంలో AI అందిస్తున్న పర్ ఫెక్ట్ సేవలకు కృతజ్ణతలు తెలపాలని కోరింది. మానవ వైద్యులకంటే AI చాట్ బాట్లు రోగనిర్ధారణ విషయంలో ఖచ్చితత్వాన్ని ప్రశంసించింది. కృత్రిమ మేధస్సు వైద్యరంగంలో ఓ విప్లవాత్మక శక్తిగా మారింది. 74శాతం రోగనిర్ధారణ రేటున్న వైద్యులతో పోలిస్తే.. AI చాట్ బాట్ లు 99శాతం ఖచ్చితత్వంతో రోగ నిర్ధారణ చేస్తున్నాయి. ఇది AI పై పెరుగుతున్న నమ్మకాన్ని నిదర్శనం. 

ప్రజల అవగాహనలో ఒక ముఖ్యమైన సమస్యను ఎత్తి చూపారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని. చిన్న AI వైఫల్యాలు కూడా తీవ్ర పరిశీలనకు గురవుతాయి. మానవుల మాదిరిగా కాకుండా AI జవాబుదారీతనం కలిగి ఉండదని.. ఎవరోఒకరు బాధ్యత వహించాల్సి ఉంటుందని వాదిస్తున్నారు. పర్యవేక్షణలేకుండా AI టెక్నాలజీలపై గుడ్డి నమ్మకాన్ని ప్రమాదకరంగా మారుస్తుందన్నారు. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ వంటి విషయాల్లో వైద్యరంగంలో ఇది చాలాముఖ్యం అంటున్నారు.

డాక్టర్లను AI భర్తీ చేయగలదా? బిల్ గేట్స్ ఏమంటున్నారంటే.. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రముఖ వ్యాపారవేత్త బిల్ గేట్స్ స్పందన చూస్తే.. రాబోయే రోజుల్లో AI  స్పెషలిస్టు డాక్టర్లను భర్తీ చేస్తుందంటున్నారు. అయితే దీనికి AI వ్యవస్థలకు మానవ తార్కికం, పర్యవేక్షణ అవసరం అంటున్నారు. అధిక రోగనిర్ధారణ ఖచ్చితత్వం ఉన్నప్పటికీ సంక్లిష్ట ఆరోగ్య సంరక్షణ వాతావరణాలకు అవసరమైన సందర్భోచిత అవగాహన, సానుభూతి,డైనమిక్ డెసిషన్స్ తీసుకునే స్కిల్స్ కృత్రిమ మేధస్సు(AI)కి లేవంటున్నారు బిల్ గేట్స్. 

LLM ల లిమిట్స్.. నిపుణులు ఏమి చెబుతున్నారంటే.. 

AI ఫ్యూచర్ పనితీరుపై AI మార్గదర్శకుడు యాన్ లెకున్ ఇలా చెప్పారు. నేటి AI విప్లవం ఎక్కువగా ChatGPT, Gemini ,LLaMA వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMలు) ద్వారా నడుస్తోంది. అయితే ఈ మోడళ్లు త్వరలో వాడుకలో లేకుండా పోవచ్చు. భ్రమలు, పక్షపాతం వంటి వాటిని అధిగమించే తదుపరి జనరేషన్ సిస్టమ్స్ పై దృష్టి పెట్టాలని యాన్ లెకున్ డెవలపర్లను కోరుతున్నారు. ఈ సమస్యలు LLMలలో అంతర్లీనంగా ఉన్నాయని.. సులభంగా పరిష్కరించలేమని గ్యారీ మార్కస్ ,అభిజ్ఞా శాస్త్రవేత్తలు అరవింద్ నారాయణన్ ,సయాష్ కపూర్ వంటి ప్రముఖ AI విమర్శకులు వాదిస్తున్నారు. 

►ALSO READ | వాట్సాప్ ఫర్ ఐపాడ్.. ఈ యాప్​ ద్వారా ఒకేసారి 32 మందితో.. వీడియో, ఆడియో కాల్స్ మాట్లాడొచ్చు !

LLM లు శిక్షణ డేటాలోని నమూనాలను మాత్రమే గుర్తిస్తాయని వారు హైలైట్ చేస్తారు.- అవి నిజాన్ని అర్థం చేసుకోవన్నారు. దీంతో డేటాసెట్ ఎంత పెద్దదైనా ,బాగా క్యూరేట్ చేయబడిన  సమాచారాన్ని కల్పితం చేసే అవకాశం ఉంటుందంటున్నారు. 

AI శిక్షణ..ఖర్చు

AI శిక్షణకు శ్రామిక శక్తి కావాల్సిందే. డేటాలేబుల్ చేసేందుకు అభివృద్ది చెందుతున్న దేశాల్లో అవుట్ సోర్సింగ్ పద్దతిలో రిక్రూట్ చేయబడుతుంది. అది తక్కువ జీతంతో..ఇది శ్రమదోపికి దారితీస్తుంది. అందుకే AI బూమ్ కేవలం టెక్నాలజీకి చెందినదే కాదు..సామాజిక ఆర్థిక కోణంలో కూడా ఆలోచించాలి అంటున్నారు నిపుణులు. 

AI హైప్.. ఎదుర్కోవాల్సిన ప్రమాదాలు

మార్కస్ రాసిన టేమింగ్ సిలికాన్ వ్యాలీ పుస్తకం ప్రకారం..AI హైప్‌ను పెంచడానికి టెక్ కంపెనీలు ఉపయోగించే మూడు ప్రధాన వ్యూహాలు..

  • ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) చేరుకోవడం గురించి ఆధారం లేని వాదనలు
  • చైనాను పోటీ ముప్పుగా పిలవడం
  • AI ప్రభావం గురించి డూమ్స్‌డే లేదా యుటోపియన్ కథనాలను ప్రచారం చేయడం
  • ఈ వ్యూహాలు స్టాక్ ధరలను పెంచుతాయి .ప్రభుత్వ నిధులను పొందుతాయి.అదే సమయంలో తప్పుడు సమాచారం, సైబర్ నేరం,శ్రమ దోపిడీ వంటి వాస్తవ ముప్పులనుంచి దృష్టిని మళ్లిస్తాయి. 

సెన్సేషన్ కాదు..బాధ్యతాయుతమైన ఆవిష్కరణ కావాలి

 AI  నిస్సందేహంగా వైద్యం వంటి రంగాలలో మలుపుతిప్పే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది AI ని మొత్తం తిరస్కరించకుండా సమతుల్య దృక్పథాన్ని ఏర్పరుస్తుంది.లైఫ్ సైన్స్ వంటి రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడుల అవసరాన్ని సూచిస్తుంది. ఇది AI అభివృద్ధి ,కమ్యూనికేషన్‌కు మరింత స్థిరమైన ,బాధ్యతాయుతమైన విధానం,సంచలనాలకు దూరంగా,ఆచరణాత్మక, నైతిక ,వ్యూహాత్మక  ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తుందంటున్నారు నిపుణులు.