చాట్ జీపీటీ కోర్సు.. 3 నెలల్లో రూ.28 లక్షలు సంపాదించిన యువకుడు

చాట్ జీపీటీ కోర్సు.. 3 నెలల్లో రూ.28 లక్షలు సంపాదించిన యువకుడు

చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించాలో తెలియకపోయినా.. ప్రజెంట్ డేస్ లో దాని గురించి మాత్రం వినని వాళ్లు చాలా తక్కువే. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన వెబ్ సైట్ AI, చాట్‌బాట్‌ను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో నేర్పించే కోర్సులను అందిస్తోంది. చాట్‌జీపీటీ ఉద్యోగాలను దూరం చేస్తుందని కొంతకాలంగా వార్తలు వస్తు్న్నాయి. అయితే దాన్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తులు మాత్రం.. ఇప్పుడు దాన్ని ఉపాధి అవకాశంగా మార్చుకుంటున్నారు. దీని ద్వారా కేవలం మూడు నెలల్లోనే ఒక వ్యక్తి 35వేల డాలర్లు అంటే రూ.28 లక్షలు సంపాదించాడు.

లాన్స్ జంక్ అనే 23 ఏళ్ల వ్యక్తి ఓ ఎడ్యుకేషన్ పోర్టల్‌లో ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించాడు. ఇందులో చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తాడు. కేవలం మూడు నెలల్లోనే ప్రపంచం నలుమూలల నుంచి 15 వేల మందికి పైగా ఈ కోర్సులో చేరారు. "ChatGPT మాస్టర్ క్లాస్: ఎ కంప్లీట్ ChatGPT గైడ్ ఫర్ బిగినర్స్" అనే పేరుతో మొదలు పెట్టిన లాన్స్ .. ఈ కోర్సు పేరిట ఇప్పటివరకు 35వేల డాలర్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని అర్జిస్తున్నాడు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులో ఉండేలా, అర్థం అయ్యేలా చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ యాప్ ను తీసుకొచ్చానని లాన్స్ జంక్ తెలిపారు. చాట్ జీపీటీ అనేది అద్భుత సాధనమని, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ప్రజలు ఇప్పటికీ ChatGPTకి భయపడుతున్నారని తాను భావిస్తున్నానని, అందుకే ప్రజలకు వివరించేందుకు వీలుగా ఓ కోర్సు ఏర్పాటు చేశానని చెప్పారు. దీని కోసం జంక్.. ChatGPT కి సంబంధించి ఎలాంటి కోర్సూ తీసుకోలేదు. తాను వాడుతూనే చాట్ జీపీటీపై పట్టు సాధించడం గొప్ప విశేషం.

కోర్సు ఖరీదు $20

ఈ చాట్ బోట్ లో జంక్  ప్రతిరోజూ గంటల తరబడి గడుపుతాడని వెల్లడించాడు. జంక్- డిజైన్ చేయబడిన ఈ కోర్సు ఏడు గంటల నిడివితో ఉంటుంది. ప్రస్తుతం ఈ కోర్సు ధర 20 డాలర్లు. ఇందులో బిగినర్స్ కోసం 50 క్లాసులు ఉన్నాయి. ఈ కోర్సును సిద్ధం చేయడానికి జంక్ కు మూడు వారాలు పట్టింది. ప్రస్తుతం ఈ కోర్సులో ప్రవేశం పొందుతున్న వారిలో అమెరికాకు చెందిన వారే ఎక్కువ. భారతదేశం, జపాన్, కెనడా నుంచి ఇప్పుడిప్పుడే ఈ కోర్సులో జాయిన్ అవుతున్నారు. వెనిజులా, రష్యా, మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాల విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుండడం గమనార్హం.