వేములవాడలో వేద విద్యార్థులకు జాతీయ స్థాయి పరీక్షలు

వేములవాడలో వేద విద్యార్థులకు జాతీయ స్థాయి పరీక్షలు

వేములవాడ, వెలుగు: వేద విద్యార్థులకు నిర్వహించే చతుర్వేద స్మార్త పరీక్షలు వేములవాడలో ఏర్పాటు చేయనుండడం అభినందనీయమని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ అన్నారు. రాజన్న దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వర వేద ఆగమ సంస్కృత విద్యాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటిసారిగా నిర్వహించనున్న పరీక్షలపై తుని పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, ఆది శ్రీనివాస్ సమావేశమై చర్చించారు. అంతకుముందు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 

అనంతరం వారు మాట్లాడుతూ ఆగమ సంస్కృత విద్యాలయ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్వత్ సదస్సు లో భాగంగా వేద పండితులకు నిర్వహించే చతుర్వేద స్మార్త పరీక్షలకు  దేశవ్యాప్త వేద పండిత విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. నాలుగు వేదాలు చదివే పాఠశాల ఒక్క వేములవాడలోనే ఉందన్నారు. గతంలో తిరుమల తిరుపతిలో మాత్రమే నిర్వహించే పరీక్షలు.. రాజన్న సన్నిధిలో నిర్వహించి వేద విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేయడం మన ప్రాంత అదృష్టమన్నారు.