4 ప్యాలెస్​ల సముదాయమే చౌమహల్లా

4 ప్యాలెస్​ల సముదాయమే చౌమహల్లా

చార్మినార్​ దగ్గరలోని లాడ్​బజార్​ తర్వాత కొద్ది దూరంలో యూరోపియన్​ శైలిలో నిర్మించిన 4 ప్యాలెస్​ల సముదాయమే చౌమహల్లా. ఈ ప్యాలెస్​ను మక్కా మసీదు వెనుక ప్రాంతంలో సుమారు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో నిర్మించారు. రెండో నిజాం అయిన నిజాం అలీఖాన్​ కాలంలోనే ఈ ప్రాంతంలో ఖిల్వత్​ ప్యాలెస్​ను నిర్మించారు. ఖిల్వత్​ అంటే ఏకాంత ప్రదేశమని అర్థం. ఐదో నిజాం అఫ్జలుద్దౌలా ఇరాన్​లోని షా ప్యాలెస్​ను ఆధారంగా చేసుకొని ఖిల్వత్​ ప్యాలెస్​ ఉన్న ప్రాంతంలో ఈ చౌమహల్లా ప్యాలెస్​ను నిర్మించాడు. 

చౌమహల్లా అంటే నాలుగు అందమైన భవనాల సముదాయం. అవి..

1. అఫ్తాబ్​ మహల్​ 2. మహ్తబ్​ ఆలయం 3. తహ్​నియత్​ మహల్​ 4. అఫ్జల్​ మహల్​

1912లో ఏడో నిజాం చౌమహల్లాకు మరమ్మతులు చేయించి ఈ ప్యాలెస్​ను మరింత అందంగా తీర్చిదిద్దారు.  1915లో చౌమహల్లాలోని ప్రధాన ద్వారం వద్ద ఏడో నిజాం ఒక పెద్ద గడియారాన్ని ఏర్పాటు చేశారు.