
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 04.
పోస్టులు: 12 డిప్యూటీ మేనేజర్ (ఐటీ)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీటెక్ లేదా బీఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్ స్కోర్‌తోపాటు పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం: జులై 04.
లాస్ట్ డేట్: ఆగస్టు 04.
సెలెక్షన్ ప్రాసెస్: గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.