
బషీర్‌బాగ్, వెలుగు: ఫర్నిచర్అమ్ముతామంటూ సైబర్‌నేరగాళ్లు సిటీకి చెందిన ఓ మహిళను మోసగించారు. విడతల వారీగా రూ.1.30లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ఓ మహిళ ఇటీవల క్విక్కర్ యాప్‌లో సెకండ్హ్యాండ్ఫర్నిచర్కు సంబంధించిన యాడ్చూసింది. అక్కడ మెన్షన్చేసిన ఫోన్‌నంబర్‌కు కాల్చేసింది.
ఆర్మీ ఆఫీసర్పేరుతో ఓ వ్యక్తి మహిళతో మాట్లాడాడు. ఫర్నిచర్ అందుబాటులో ఉందని.. ముందుగా 20 శాతం డబ్బులను చెల్లించాలని సూచించాడు. దీంతో మహిళ మొదట రూ.5 వేలు చెల్లించింది. తర్వాత ల్యాప్టాప్కూడా అమ్ముతామనడంతో రూ.9వేలు, డోర్‌డెలివరీ చేస్తామనడంతో ఇంకో రూ.10వేలు పంపింది. జీఎస్టీ, డెలివరీ చార్జీలు ఉంటాయనడంతో మరో రూ.16,400 ట్రాన్స్ఫర్చేసింది. మరికొన్ని వస్తువులు ఇస్తామని ఆశచూపడంతో రూ.48వేలు పంపింది. మళ్లీ.. డబ్బు అడగడంతో మహిళ స్కామ్ అని గ్రహించింది. రూ.1,30,209 మోసపోయానని ఆన్లైన్లో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.