షిన్వా తో తెగుళ్లకు చెక్

షిన్వా తో తెగుళ్లకు చెక్

హైదరాబాద్, వెలగు​: మిరప సాగులో వచ్చే లెపిడోప్టెరాన్ తెగుళ్లు, త్రిప్‌‌లను ఎదుర్కోవడానికి 'షిన్వా' పురుగు మందును తీసుకొచ్చామని ఇన్‌‌సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ (ఐఐఎల్) సదరన్ రీజియన్ వైస్ ప్రెసిడెంట్ వీకే గార్గ్ తెలిపారు.   

మిరప సాగు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని, తెగుళ్లు, వ్యాధులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. షిన్వా వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పారు. ఈ మందు కోసం నిస్సాన్  కెమికల్  కార్పొరేషన్ (జపాన్) పేటెంట్ దక్కించుకుందని చెప్పారు.  అధిక, తక్కువ ఉష్ణోగ్రతలు రెండింటిలోనూ షిన్వా బాగా పని చేస్తుందన్నారు.