బ్లాక్ రైస్ తో అనారోగ్య సమస్యలకు చెక్

బ్లాక్ రైస్ తో అనారోగ్య సమస్యలకు చెక్

అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న బ్లాక్ రైస్ ను పండిస్తున్నారు మహబూబా బాద్ జిల్లా చిన్న గూడూరు మండలం గుండంరాజుపల్లికి చెందిన రైతు  శంకర్ నారాయణ. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కొందరు రైతులు నల్ల ధాన్యం   పండించగా ... శంకర్ నాయణ అక్కడివెళ్లి  వాటిని కొనుక్కోని వచ్చారు.  కొన్ని రోజుల పాటు బ్లాక్ రైస్ వండుకొని తినగడం వల్ల ఆరోగ్యంగా ఏంతో మేలు జరిగడంతో  అదే పంటను పండిచాలని నిర్ణయించుకున్నారు.  ఇప్పటికే గత సీజన్ లో పంటపండించిన శంకర్ నారాయణ .. ఈ సీజన్ లోనూ బ్లాక్ రైస్ ను సాగు చేస్తున్నారు

బ్లాక్ రైస్ ఆరోగ్యానికి మంచిదంటున్నారు వ్యవసాయశాఖ అధికారులు. ఈ బియ్యంలో ఉండే ఆంకోసైనిన్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి ఇమ్యూనిటీ పవర్ పెంచు తాయంటున్నారు. షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులను నియంత్రిస్తుందని చెబుతున్నారు.  శరీరంలో అదనపు కొవ్వును కరిగిస్తుందంటున్నారు.  ఇందులో విటమిన్ –బి, ఇ, నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్  వంటి ఖనిజ విలువలు ఎక్కువగా ఉంటాయంటున్నారు అధికారులు. బ్లాక్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కణాలను ఉపయోగం జరుగుతుందని చెబుతున్నారు  వ్యవసాయ శాఖ అధికారులు. 

అయితే ఈ వరి వంగడానికి  తెగుళ్లు ఎక్కువగా రావడంపై పరిశోధనలు జరుగుతున్నాయంటున్నారు  వ్యవసాయశాఖ సైంటిస్టులు. మామూలు వరి కంటే వీటి దిగుబడి తగ్గువగా ఉంటుందన్నారు. సాధారణ వరిధాన్యం ఎకరా నికి 30 నుంచి 35 బస్తాల ధాన్యం దిగుబడి వస్తే...బ్లాక్ రైస్ 10 నుంచి 15 బస్తాల దిగుబడి వస్తుందంటున్నారు. ధర విషయంలో బ్లాస్ రైస్ రేటు ఎక్కువగా ఉంటందన్నారు.