ఖర్చు రూ.కోటి 20 లక్షలు.. కనీసం లావటరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు

ఖర్చు రూ.కోటి 20 లక్షలు.. కనీసం లావటరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు

లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) సినిమాకి చెన్నై ఎయిర్‌పోర్ట్‌(Chennai airport) సిబ్బంది షాకిచ్చారు. ఆయన హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్2(Indian2). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చెన్నై ఎయిర్‌పోర్ట్‌ లో జరుగుతోంది. ఇందులో భాగంగా  విమానాశ్రయం లోపల  ఓ భారీ సీన్‌ చిత్రీకరిస్తుండగా.. ఎయిర్‌పోర్ట్‌ నిర్వాహాకులు షూటింగ్‌ను మధ్యలోనే ఆపేశారట. దీంతో చిత్ర బృందం ఒక్కసారిగా షాకయ్యారట. షూటింగ్ కోసం పర్మిషన్ తీసుకున్నప్పటికీ.. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ఆలా చేయడంపై అసహనం వ్యక్తం చేశారట మేకర్స్. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇండియా2 మేకర్స్ ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాలు, డిపార్చర్‌ ఏరియాలో షూటింగ్‌ చేసుకోవడానికి మాత్రమే పర్మీషన్ తీసుకున్నారట. అలా కాకుండా.. లావటరీ ఏరియాలో షూటింగ్‌ చేస్తుండటంతో ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది వారిని అడ్డుకున్నారట. పర్మిషన్ ఉన్న చోట షూటింగ్ చేసుకోవాలని, లేదంటే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని సూచించారట. 

దీంతో చేసేదేమీ లేక.. వారు సూచించినట్టుగా పర్మిషన్ ఉన్నచోట షూటింగ్ చేసుకొని బయటపడ్డారట ఇండియా2 యూనిట్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కేవలం డిపార్చర్‌ ఎరియాలో షూటింగ్ పర్మీషన్‌ కోసం ఏకంగా కోటి ఇరవైనాలుగు లక్షలు చెల్లించారట మేకర్స్. ఇది తెల్సుకున్న నెటిజన్స్.. కోటి కడితే కనీసం లావటరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.