
పెళ్లిల్లకు ఈ జనరేషన్ బాగా ఇంపర్టెన్స్ ఇస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటూ కోట్లల్లో ఖర్చు చేస్తోంది. తమిళనాడుకు చెందిన ఓ జంట మాత్రం వెరెటీ వెడ్డింగ్ ను ప్లాన్ చేసింది. సముద్రం లోపల పెళ్లిచేసుకుని తమ ప్రత్యేకతను చాటుకుంది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని 60 అడుగుల లోతుకు వెళ్లి దండలు మార్చుకున్నారు. తిరువన్నమలైకి చెందిన చిన్నదురై, కోయంబత్తూరుకు చెందిన శ్వేతకు పెద్దలు సంబంధం కుదిర్చారు. అయితే ఓ మంచి అంశంపై అందిరిలో చర్చ జరగాలనే ఉద్దేశంతో సముద్రంలో పెళ్లి చేసుకుంది ఈ జంట. సముద్ర గర్భంలో పేరుకు పోతున్న చెత్త గురించి అవగాహన కల్పించేందుకు ఇలా చేశామన్నారు.
see more news