
తిరుమల శ్రీవారికి అరుదైన బంగారు ఆభరణాలు విరాళం అందాయి. శ్రీవారి బంఢాగారంలో మరిన్ని అద్బుతమైన స్వర్ణాభరణాలు చేరాయి.చెన్నై కి చెందిన ఓ కుటుంబం స్వామి వారికి బంగారం శంకు, చక్రాలను విరాళంగా అందించారు..
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. వెలకట్టలేని బంగారు వజ్ర వైడూర్యాల ఆభరణాలు వెంకన్న సొంతం. భక్తులు మొక్కు లో భాగంగా సమర్పించే కానుకలు కూడా ఎంతో ఖరీదైనది గా ఉంటున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు ( జులై 29) ఉదయం చెన్నైకు చెందిన భక్తుడు సుదర్శన్ కుటుంబ సభ్యులు .. తిరుమల శ్రీవారికి రూ. 2.4 కోట్లు విలువ చేసే రెండున్నర కేజీల బంగారం శంకు, చక్రాలను విరాళంగా అందించారు. ఇలా వెంకన్నకు చేరుతున్న కానుకలు, విరాళంగా సమర్పిస్తున్న ఆభరణాలు కోట్లాది రూపాయిల విలువైనవిగా ఉంటున్నాయి.
శ్రీవారి ఆలయంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి దాతలు బంగారు స్వర్ణాభరణాలను అందించారు ఈ సందర్భంగా దాతలకు శ్రీవారి దర్శనం .. అనంతరం రంగనాయక మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శేష వస్ర్తంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారికి కోట్లాది రూపాయిల విలువైన ఆభరణాలను అందించిన దాతలను అదనపు ఈఓ వెంకయ్య చౌదరి అభినంచారు. శ్రీవారి మూల మూర్తికి ఈ ఆభరణాలను అలంకరిస్తారు. శంకుచక్రాధిపతి అయిన శ్రీవారికి అపురూపంగా అత్యంత సుందరంగా తయారు చేసారు
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. వెలకట్టలేని బంగారు వజ్ర వైడూర్యాల ఆభరణాలు వెంకన్న సొంతం. భక్తులు మొక్కు లో భాగంగా సమర్పించే కానుకలు కూడా ఎంతో ఖరీదైనది గా ఉంటున్నాయి. నిత్యం శ్రీవారిని దర్శించుకునే వేలాదిమంది భక్తులు సమర్పించే కానుకలు కూడా కోట్లాది రూపాయల విలువైనవిగా ఉంటున్నాయి.