IPL 2026: చెన్నైకు మరో బిగ్ షాక్.. ప్లే ఆఫ్స్ వేళ టోర్నీ నుంచి కీలక ప్లేయర్ ఔట్

IPL 2026: చెన్నైకు మరో బిగ్ షాక్.. ప్లే ఆఫ్స్ వేళ టోర్నీ నుంచి కీలక ప్లేయర్ ఔట్

చెన్నై: ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరి స్టేజ్‎కు చేరుకుంది. పాయింట్ల పట్టికలో టాఫ్ ఫోర్ ప్లేస్ కోసం ఆయా జట్లు పోరాడుతున్నాయి. ఈ క్రూషియల్ టైమ్‎లో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్‏కు బిగ్ షాక్ తగిలింది. ప్లే ఆఫ్స్ వేళ ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ జేమీ ఓవర్టన్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు టోర్నీలోని మిగిలిన మ్యాచులకు దూరమయ్యాడు.

 ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది. ఓవర్టన్ స్థానంలో సీఎస్క్‎కే రీప్లేస్మెంట్  ప్రకటించింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆల్-రౌండర్ డయాన్ ఫోరెస్టర్‌ను ఓవర్టన్ స్థానంలో జట్టులోకి తీసుకున్నట్లు సీఎస్కే గురువారం (మే 14) ప్రకటించింది. చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓవర్టన్ కీలక దశలో టోర్నీకి దూరంగా కావడం గైక్వాడ్ సేనకు ఎదురు దెబ్బే అంటున్నారు విశ్లేషకులు. 

►ALSO READ | శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌ ట్రై-సిరీస్‌కు భారత ఏ జట్టు ప్రకటన.. కెప్టెన్‎గా తిలక్, ఐపీఎల్ యువ సంచలనాలకు చోటు

ఈ సీజన్‎ను పేలవంగా ఆరంభించిన చెన్నై తిరిగి గాడినపడింది. ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడిన చెన్నై ఆరు విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. మే 15న లక్నోలోని ఎకానా స్టేడియంలో ఎల్ఎస్‎జీతో సీఎస్కే తలపడనుంది. ఈ మ్యాచులో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లాలని భావిస్తోంది గైక్వాడ్ సేన.