IPL 2024: ఇక్కడ కూడా ధోనీదే హవా: హైదరాబాద్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్

IPL 2024: ఇక్కడ కూడా ధోనీదే హవా: హైదరాబాద్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో విశాఖలో జరిగిన మ్యాచ్ తర్వాత నేడు (ఏప్రిల్ 2) ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టగానే అభిమానులు భారీ సంఖ్యలో అతనిని స్వాగతం పలికారు. 

ధోనీ ధోనీ అని నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆటగాళ్లు ఎయిర్‌పోర్ట్‌ నుంచి భారీ సెక్యూరిటీతో హోటల్‌కు చేరుకున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 5) ఉప్పల్‌ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. ఓ వైపు పాట్ కమ్మిన్స్, మరోవైపు ధోనీ ఉండడంతో ఈ మ్యాచ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. రెండు జట్లు బలంగా ఉండడంతో అభిమానులకు ఈ  మ్యాచ్ మంచి కిక్ ఇవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. 

చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్ లాడితే రెండు మ్యాచ్ ల్లో గెలిచింది. తొలి రెండు మ్యాచ్ ల్లో బెంగళూరు, రాజస్థాన్ పై నెగ్గిన గైక్వాడ్ సేన వైజాగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చిత్తుగా ఓడింది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒక విజయం మాత్రమే సాధించింది. తొలి మ్యాచ్ లో కేకేఆర్ చేతిలో ఓటమి తర్వాత ముంబైపై ఈజీగా గెలిచింది. ఇక గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చిత్తుగా ఓడింది.