బాల్క సుమన్ పై ఎలక్షన్ కమిషన్ కు కంప్లయింట్ : వివేక్ వెంకటస్వామి

బాల్క సుమన్ పై ఎలక్షన్ కమిషన్ కు కంప్లయింట్ : వివేక్ వెంకటస్వామి

చెన్నూరు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ నడుస్తుంది. నామినేషన్ల దాఖలు సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు.. ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అభ్యర్థులు అందరూ అభ్యర్థులుగానే ఉంటారు.. ఎవరికీ ప్రత్యేక హోదాలు ఉండవు.. ఈ విషయం తెలిసి కూడా చెన్నూరులో పోలీసులు వ్యవహరించిన తీరు.. ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయటానికి వెళ్లిన వివేక్ వెంకటస్వామిని అడ్డుకున్నారు పోలీసులు. కార్లకు అనుమతి లేదని.. కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని చెబుతూ.. రిటర్నింగ్ అధికారి ఆఫీసుకు అర కిలోమీటర్ దూరంలో వాహనాలను ఆపేశారు పోలీసులు. 144 సెక్షన్ ఉందని.. ఎన్నికల నిబంధనలు అని చెప్పారు పోలీసులు. దీంతో చట్టాన్ని, పోలీసులను గౌరవించి.. వివేక్ వెంకటస్వామి నడుచుకుంటూనే వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

అయితే ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ వాహనాన్ని, అనుచరులను రిటర్నింగ్ అధికారి ఆఫీసు వరకు అనుమతించారు పోలీసులు. 144 సెక్షన్ అనేది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వర్తించదు.. ఎన్నికల నిబంధనలు బీఆర్ఎస్ అభ్యర్థికి వర్తించవు అన్నట్లు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వివేక్ వెంకటస్వామి. ఈ సమయంలో ప్రశ్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలపై బీఆర్ఎస్ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 

Also Read :-  బాల్కసుమన్ గూండాయిజానికి ఇదే నిదర్శనం : వివేక్ వెంకటస్వామి ఆగ్రహం

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై ఎలక్షన్ కమిషన్ కు కంప్లయింట్ చేశారు వివేక్ వెంకటస్వామి. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.  

  • Beta
Beta feature