చెన్నూరు, వెలుగు: కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను చెన్నూరు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
క్యాతనపల్లిలో ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకోవడానికి వచ్చిన మంత్రి కారుపై దాడి చేసింది బాల్క సుమన్, బీఆర్ఎస్నేతలు కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటేనే రౌడీయిజం, దాడులు చేసే పార్టీ అని విమర్శించారు. మంత్రిపై అసత్య ప్రచారాలు చేస్తే గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
