
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంటలో నూతన వధూవరులను చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు. ఆదివారం పట్టణంలోని పీవీఆర్ గార్డెన్స్‌లో మాదాసు మొగిలి–పుష్పలీల కొడుకు మాల విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాదాసు రాహుల్–కార్తిక వివాహానికి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. అనంతరం మాచనపల్లి గ్రామానికి చెందిన అభిమాని నర్మెట్ట అఖిల్ ఇంటికి వెళ్లి టీ తాగారు.
ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామితో అఖిల్ నానమ్మ పద్మ మాట్లాడుతూ గడ్డం వెంకటస్వామి ప్రజలకు చేసిన సేవలు మరువలేనియన్నారు. ఆయన హయాంలో చాలామంది నిరుపేదలకు ఇల్లు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. నాటి రాజకీయాలకు నేటి రాజకీయాలకు చాలా తేడా ఉందని అప్పటి రోజులే బాగున్నాయని ఆమె తన అనుభవాలను వివేక్ తో పంచుకున్నారు. అనంతరం పలువురు వివేక్ వెంకటస్వామిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శీలం శ్రీనివాస్, రాజు, సారంగపాణి, లీడర్లు పాల్గొన్నారు