చొప్పదండిలో చెన్నూర్​ ఎమ్మెల్యే పర్యటన 

చొప్పదండిలో చెన్నూర్​ ఎమ్మెల్యే పర్యటన 

చొప్పదండి, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంగళవారం చొప్పదండి మండలంలో పర్యటించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌‌కు చేరుకున్న వివేక్‌‌కు స్థానిక ఎమ్మెల్యే 
మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ లీడర్లు స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆర్నకొండలో తన అభిమాని కోమల్ల రాజేశం తండ్రి నారాయణ ఇటీవల మరణించగా.. వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ పార్టీ జిల్లా వర్కింగ్​ ప్రెసిడెంట్​ కోమటిరెడ్డి పద్మాకర్​రెడ్డి, కొండగట్టు ఉత్సవ కమిటీ చైర్మన్​ఇప్ప శ్రీనివాస్​ రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌‌ కొత్తూరి మహేశ్‌‌, పట్టణ అధ్యక్షుడు చందు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అభిమానికి పరామర్శ 

ధర్మారం, వెలుగు: ధర్మారం మండలం గోపాల్‌‌రావుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాకా కుటుంబ అభిమాని పొన్నవేని స్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మంగళవారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వారి ఇంటికి వెళ్లి స్వామిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ లీడర్లు కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశం గౌడ్, ఎండీ అషు, శ్రీనివాస్ రెడ్డి  పాల్గొన్నారు.