చెన్నూరులో పశువులను కబేళాకు తరలిస్తున్న వాహనం పట్టివేత

చెన్నూరులో పశువులను కబేళాకు తరలిస్తున్న వాహనం పట్టివేత

చెన్నూరు, వెలుగు: పశువులను అక్ర మంగా కబేళాలకు తరలిస్తున్న వాహనాన్ని చెన్నూరు పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ దేవేందర్ రావు వివరాల ప్రకారం.. పక్కా సమాచారం మేరకు కిష్టంపేట వై జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా 25 పశువులను తరలిస్తున్న బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 డ్రైవర్​ను విచారించగా, వాటిని మందమర్రికి చెందిన ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రలో కొనుగోలు చేసి కబేళాకు తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టుకున్న పశువులను లింగంపల్లి గోశాలకు తరలించినట్లు సీఐ చెప్పారు. నిందితులపై యానిమల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామన్నారు. అనుమతి  లేకుండా మూగజీవాలను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.