ఇప్పటికైనా కారు దిగిన్రు.. సంతోషం: వివేక్ వెంకటస్వామి

ఇప్పటికైనా కారు దిగిన్రు.. సంతోషం: వివేక్ వెంకటస్వామి
  •  ఆటోల్లో వచ్చిన బీఆర్​ఎస్​ నేతల తీరుపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: ‘‘బీఆర్ఎస్​ నేతలకు ఇప్పటికైనా సోయి వచ్చింది. కారు దిగి.. సామాన్యులు ఎక్కే ఆటోల్లో రావడం సంతోషం”అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. అసెంబ్లీకి ఆటోల్లో వచ్చిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరుపై ఆయన ఘాటుగా స్పందించారు. బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి ఎంటర్​ అవుతున్న  సమయంలోనే వివేక్​ వెంకటస్వామి హౌస్​కు​ అటెండ్​ అయ్యేందుకు వచ్చారు. 

ఈ సందర్భంగా మీడియా ఆయనను పలకరించగా.. బీఆర్​ఎస్ ​నేతలు ఆటోవాళ్లను రెచ్చగొడుతూ రాజకీయ ప్రయోజనం పొందాలని విఫలయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఫ్రీ బస్సులకు మహిళల నుంచి మంచి స్పందన వస్తోందని, వారు  సంతోషంగా ఉన్నారని వివేక్​ అన్నారు.