చెన్నూరు ఎస్‌‌‌‌బీఐ గోల్డ్‌‌‌‌ రికవరీకి యత్నాలు.. పోలీసుల అదుపులో క్యాషియర్‌‌‌‌ నరిగె రవీందర్‌

చెన్నూరు ఎస్‌‌‌‌బీఐ  గోల్డ్‌‌‌‌ రికవరీకి యత్నాలు.. పోలీసుల అదుపులో క్యాషియర్‌‌‌‌ నరిగె రవీందర్‌

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూర్‌‌‌‌ ఎస్‌‌‌‌బీఐలో జరిగిన గోల్డ్‌‌‌‌ స్కామ్‌‌‌‌ కేసులో పోలీసులు ముందడుగు వేశారు. ప్రధాన నిందితుడైన క్యాషియర్‌‌‌‌ నరిగె రవీందర్‌‌‌‌తో పాటు అతడికి సహకరించిన వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. 

బ్యాంకు నుంచి మాయం చేసిన గోల్డ్‌‌‌‌ను ఎక్కడెక్కడ తాకట్టు పెట్టాడు ? ఎవరి అకౌంట్ల ద్వారా లావాదేవీలు కొనసాగించాడు ? అనే పూర్తి సమాచారాన్ని రాబడుతున్నారు. రవీందర్‌‌‌‌ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు వివిధ బ్యాంకులు, గోల్డ్‌‌‌‌ లోన్‌‌‌‌ సంస్థలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఆ వివరాల ఆధారంగా బంగారం రికవరీ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఈ కేసు రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.