వైభవంగా చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు

వైభవంగా చెర్వుగట్టు  బ్రహ్మోత్సవాలు

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు  జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి,అమ్మవార్ల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ప్రభుత్వం తరుపున నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  వడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.