చేర్యాల సీఐ అలా బుక్కయ్యారు!

చేర్యాల సీఐ అలా బుక్కయ్యారు!

చేర్యాల సీఐని ఓ రోడ్డు ప్రమాదం బుక్ చేసింది. అనుమతి లేకుండా ఊరు వదిలి వెళ్లిన విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో సస్పెన్షన్ వేటు పడింది. గత కొద్దిరోజుల క్రితం చేర్యాల జడ్పీటీసీ మల్లేశం హత్య జరిగిన రోజు సీఐ శ్రీనివాస్ అందుబాటులో లేకపోవడం ఈ చర్యలకు మొదటి కారణంగా తెలుస్తోంది. అదే రోజు చేర్యాల పోలీస్ స్టేషన్లో సీఐ కోసం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దాదాపు గంటన్నరకు పైగా వేచి చూసినట్టు సమాచారం.

సీఐ సమయానికి అందుబాటులో లేకపోవడంతో గతంలోనే ఉన్నతాధికారులు అతనికి మెమో జారీ చేశారు. అయినప్పుటికీ తీరు మార్చుకోని శ్రీనివాస్.. గత నెల 24న ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పొరుగు ప్రాంతానికి వెళ్లాడు. అయితే తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ కావడంతో తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఐను సస్పెండ్ చేస్తున్నట్టు సిద్దిపేట సీపీ శ్వేతా వెల్లడించారు. అయితే శ్రీనివాస్ చేర్యాల సీఐగా బాధ్యతలు చేపట్టిన కేవలం 9 నెలల్లోనే సస్పెండ్ కావడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.