
హైదరాబాద్, వెలుగు: బజాజ్ఆటో హైదరాబాద్‌లో వినాయక బజాజ్ బేగంపేట షోరూమ్‌లో చేతక్ 2901ని బుధవారం విడుదల చేసింది. ఒక్కసారి చార్జ్‌చేస్తే ఇది 123 కిలోమీటర్లు వెళ్తుంది. డిజిటల్ కన్సోల్, అల్లాయ్ వీల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్, ఆప్షనల్ టెక్ ప్యాక్ యాప్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. చేతక్ 2901 కాచిగూడ, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్ బేగంపేటలోని సిద్ది వినాయక బజాజ్ షోరూమ్‌లో బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ.96 వేలు.