
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కు తున్న ఈ చిత్రాన్ని జయంతీలాల్ గడ నిర్మిస్తున్నారు. నిన్న హైదరాబాద్‌లో ఈ మూవీ మొదలైంది. రాజమౌళి క్లాప్ కొట్టారు. రమా రాజమౌళి కెమెరా స్విచాన్ చేశారు. ఎ.ఎం.రత్నం గౌరవ దర్శకత్వం వహించారు. రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్ర్కిప్ట్ అందించారు. ‘రంగస్థలం’ సినిమా తీసిన లొకేషన్‌లో వేసిన పెద్ద సెట్‌లో ఈ లాంగ్ షెడ్యూల్ స్టార్టయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘బెల్లంకొండ శ్రీనివాస్, వినాయక్ కాంబినేషన్‌లో మూవీ చేస్తున్నందుకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఈ మూవీ హిస్టరీ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ చిత్రంలో సాహిల్ వైద్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్, స్వప్నీల్, అశిష్ సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘ఛత్రపతి’కి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా స్ర్కిప్ట్ లో మార్పులు చేశారు. నిజార్ అలీ షఫీ సినిమాటోగ్రఫీ, అనల్ అరసు యాక్షన్ కొరియోగ్రఫీ, తనిష్క్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.