కొండచిలువను బైక్‌కు కట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ.. భయపడ్డ జనం.. వీడియో వైరల్

కొండచిలువను బైక్‌కు కట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ.. భయపడ్డ జనం..  వీడియో వైరల్

పాములు లేదా విషపూరితమైన జంతువులు ఇంట్లోకి వస్తే కొందరు కొట్టి చంపేస్తుంటారు. మరికొందరు అటవీశాఖకి సమాచారం ఇస్తుంటారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్లో జరిగిన ఓ షాకింగ్ ఘటన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకతను పెద్ద కొండచిలువను తాడుతో బైక్‌కి కట్టి లక్కేళ్తున్నట్లు చూడొచ్చు. 

ఎం జరిగిందో తెలియదు కానీ కొండచిలువను రోడ్డుపై లాక్కెళ్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కొండచిలువను బైక్ వెనుక తాడుతో కట్టి ఎక్కడికో ఈడ్చుకెళ్తున్నాడో తెలియక పోయిన ఈ సంఘటన చూసిన తర్వాత కొంతమంది భయపడ్డారు, చాలామంది జంతువుల పట్ల క్రూరత్వం పనికిరాదు అని మండిపడ్డారు.

ఈ వీడియో వైరల్ అయిన వెంటనే చాలా మంది స్థానిక పరిపాలన, అటవీ శాఖను వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో  అతనిని ఇలా చేయమని ఎవరు చెప్పారు అంటూ ప్రశ్నలు కురిపించారు. ఇది జంతు హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడం, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చాలా మంది వీడియోపై స్పందించారు.

ఈ విషయంపై అటవీ శాఖ దర్యాప్తు ప్రారంభించగ, ప్రాథమిక సమాచారం ప్రకారం అడవికి సమీపంలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తుంది. అయితే ఆ కొండచిలువను ఎవరికీ హాని కలిగించకుండా గ్రామం నుండి దూరంగా తీసుకెళ్లి  వదిలివేయాలనుకున్నానని అతను చెప్పాడు. అయితే, ఇలా జంతువులను ఈడ్చుకెళ్లడం చట్టపరమైన నేరం.