
ఫేస్ బుక్ పరిచయం ఎక్కడ వరకు వెళ్తుందో ..ఏం జరుగుతుందో చెప్పలేం. ఫేస్ బుక్ లో పరిచయం లేని వారితో చాటింగ్, మోసపోయిన ఘటనలు కొకొల్లలు. ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఈ మధ్యల చూశాం. ప్రెండ్సే కదా అని నమ్మితే మొదటికే మోసం వస్తుంది. చికాగోలో ఓ గర్భిణి ఇలానే ప్రాణాలు కోల్పోయింది. పుట్టబోయే బిడ్డకు డ్రెస్ కొనిస్తా అంటే వెళ్లిన ఆ గర్భిణీని కడుపు కోసి బిడ్డను ఎత్తుకెళ్లింది ఓ మహిళ.
చికాగో లో మార్లెన్ లోపేజ్ తొమ్మిది నెలల గర్భిణి ఉంది. ఏప్రిల్ 23 నుంచి ఆమె కనిపించకుండా పోయింది. పుట్టబోయే బిడ్డకు డ్రెస్ కొనిస్తా అని ఫేస్ బుక్ ఫ్రెండ్ రమ్మంటే బయటకు వెళ్లింది.అప్పటి నుంచి మార్లెన్ కనిపించడం లేదు. దీంతో ఆమె భర్త పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు మార్లెన్ ఫేస్ బుక్ చాటింగ్ ను చెక్ చేయడంతో అసలు విషయం తెలిసింది. మార్లెన్ ఫేస్ బుక్ ఫ్రెండ్ ఒకరు తన ఇంటికి వస్తే పుట్టబోయే బిట్టకు డ్రెస్ ఇస్తా అని మెసేజ్ చేసింది. దీనికి మార్లెన్ కూడా ఓకె చెప్పింది. దీని ఆధారంగా కేసును వేగవంతం చేశారు పోలీసులు
అయితే హత్య జరిగిన రోజు ఓ మహిళ తన బిడ్డకు ఊపిరి ఆడడం లేదని 911 పోలీస్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసింది. దీంతో పసికందును చికాగోలోని క్రిస్ట్ హాస్పిటల్ లో చేర్పించింది పోలీసులు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ పసికందుకు డీఎన్ఏ టెస్టులు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ చిన్నారి చనిపోయిన మార్లెన్ కొడుకేనని తేలింది. దీంతో వెంటనే హాస్పిటల్ లో చేర్పించిన ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన మార్లెన్ భర్త మాత్రం తన భార్య చాలా మంచిదని ఆమె చనిపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదని కన్నీరుమున్నీరయ్యాడు.
మార్లెన్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన వైద్యులు సంచలన విషయాలు చెప్పారు. మార్లెన్ చనిపోయే ముందు గొడవ జరిగిందని. ఆమె కడుపుపై బలవంతగా ఒత్తిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. డెలీవరీ సాధ్యం కాకపోవడంతోనే ఆమె కడుపును కోసి బిడ్డను బయటకు తీశారని పోస్టుమార్టం రిపోర్టులో తెలిపారు. ప్రస్తుతం మార్లెన్ కొడుకుకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

