
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ( జులై 21 ) మార్నింగ్ వాక్ చేస్తుండగా అస్వస్థతకు గురైన స్టాలిన్ చెన్నైలోని అన్నా సలైలోని గ్రీమ్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా స్టాలిన్ కు కళ్ళు తిరగడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టాలిన్ కు చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం.
మార్నింగ్ వాక్ చేస్తుండగా కళ్ళు తిరిగైనట్లు అనిపించడంతో స్టాలిన్ ఆసుపత్రిలో చేరారని.. ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని... ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు డాక్టర్లు. స్టాలిన్ కు అవసరమైన అన్ని పరీక్షలు చేశామని తెలిపారు డాక్టర్లు. ఈ మేరకు స్టాలిన్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు అపోలో హాస్పిటల్ డాక్టర్లు.
ALSO READ :ఎయిర్ ఇండియా ప్రమాదంపై దర్యాప్తు నిజాయితీగా సాగుతోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇదిలా ఉండగా.. స్టాలిన్ సోదరుడు, ప్రముఖ నటుడు ఎంకే ముత్తు శనివారం ( జులై 19 ) అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 77 ఏళ్ళ ముత్తు చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కోలీవుడ్ లో నటుడిగా, గాయకుడిగా ముత్తు ప్రసిద్ధి. గత కొంతకాలంగా సినీ రంగానికి దూరంగా ఉంటున్న ముత్తు శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు.