పోలీసులపై సీఎం జగన్ ఆగ్రహం

పోలీసులపై సీఎం జగన్ ఆగ్రహం

విశాఖపట్నం పర్యటనలో  ట్రాఫిక్‌ జామ్‌ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో గంటల తరబడి రోడ్డుపై వాహనాలను నిలిపివేశారు. దీంతో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు, సాదారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ విమానాశ్రయం దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై సీఎం జగన్ ఫైరయ్యారు. గంటల తరబడి ట్రాఫిక్ ని ఎందుకు ఆపారని.. ప్రయాణికులకు ఎందుకు ఇబ్బందులు కలుగజేశారని మండిపడ్డారు. ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నానని.. దీనిపై విచారణ జరపాలని డీజీపీని జగన్ ఆదేశించారు. నిన్న ఎయిర్ పోర్ట్ దగ్గర ప్రయాణికులను నిలిపివేయడంతో తమ లగేజీతో పరిగెత్తుకుంటూ.. విమానాశ్రయానికి చేరుకోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం

సీఎం జగన్ తో టాలీవుడ్ హీరోల సమావేశం

చిరు వ్యాపారులను దోచుకుంటున్న డిజిటల్​ పేమెంట్ ​సంస్థలు