రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం మరో ఉద్యమానికి సిద్ధం:వినయ్ భాస్కర్

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం మరో ఉద్యమానికి సిద్ధం:వినయ్ భాస్కర్

కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ కేంద్రం మాట మార్చడంపై  హనుమకొండ జిల్లా చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం దిగివచ్చే వరకు ఇక్కడి ప్రజలు మరోపోరుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. 40 ఏండ్ల కలను సాకారం అవుతుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన వాళ్లకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు.  -బీజేపీకి చట్టాలపై ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. చట్టాలను విస్మరించడమే బీజేపీ లక్ష్యంగా పనిచేస్తుందని ఆరోపించారు. 

ఎన్నో ఏండ్లుగా కోచ్ ఫ్యాక్టరీ కోసం ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. బీజేపీ,-కాంగ్రెస్ లు తెలంగాణ ప్రాంతంపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి అంబేడ్కర్ పేరు పెట్టారు.. పార్లమెంట్ కు కూడా ఆయన పేరు నామకరణం చేయాలంటే తోకముడిచారని విమర్శించారు. ఓరుగల్లు అంటే పోరాటాల నిలయమన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసంBRS ఆధ్వర్యంలో మరో పోరు కు సిద్ధం అవుతామని..దశలవారిగా తమ పోరాటాలు ఉంటాయన్నారు. చంద్రబాబు TDPకి పూర్వ వైభవం అంటున్నారు. స్వరాష్ట్రంలో తాము సాధించుకున్న వనరులను దోసుకుపోవడానికే కొత్త కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 


ఎన్నికలు వస్తేచాలు భాగ్యలక్ష్మి టెంపుల్ అడ్డాగా పాలిటిక్స్ చేయడం బండి సంజయ్ కి అలవాటుగా మారిందన్నారు. దమ్ముంటే తెలంగాణ బీజేపీ నేతలకు తాను సవాల్ విసురుతున్నానని..దాన్ని స్వీకరించాలని సూచించారు. భద్రకాళి అమ్మవారి సాక్షిగా ఎవరిది తప్పో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్నారు. -హనుమకొండలో వాల్ పోస్టర్ల కలకలంపై వినయ్ బాస్కర్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయ స్వార్థంకోసమే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని నిలదీశారు.