
కొత్తగా నియమితులైన తెలంగాణ చీఫ్ విప్, విప్‌లు శాసనమండలిలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్బంగా వారు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి ధన్యవాదాలు తెలిపారు. శాసన మండలిలో చీఫ్ విప్, విప్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద రావు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పాడి కౌశిక్ రెడ్డిలు ప్రభుత్వ విప్‌లుగా నియమితులయ్యారు. ఈ నియామకాలు శనివారం నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.