గండిపేట, వెలుగు: పిల్లలు ఆడుకుంటూ ఫోన్ కు వచ్చిన లింకును క్లిక్ చేయడంతో రూ.లక్షన్నర మాయమయ్యాయి. మణికొండకు చెందిన మధుసూదన్(57) ఫోన్‌తో తన ఇద్దరి మనవళ్లు ఆడుకుంటున్నారు. ఫోన్ చూస్తూ సైబర్ నేరగాళ్లు పంపిన లింకును ఓపెన్ చేశారు. దీంతో మధుసూదన్ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు డెబిట్ అయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
