ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్టీఆర్కు ఘన నివాళి

 ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్టీఆర్కు ఘన నివాళి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతిని ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. ఆదివారం నిజామాబాద్​ నగరంలోని ఎన్టీఆర్​ చౌరస్తా, మోపాల్​ మండల కేంద్రం, డిచ్​పల్లి మండలం ధర్మారం గ్రామంలో ఎన్టీఆర్​ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ​

ఉమ్మడి వర్ని మండలం, రుద్రూర్​ మండలంలో వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలంలో వర్ధంతిలో భాగంగా నివాళులర్పించారు.  బోధన్, సాలూరా మండలాల్లో వర్ధంతిని నిర్వహించగా, బోధన్​లో కమ్మ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ​ నిజామాబాద్​ రూరల్/ వర్న/ కోటగిరి/ బోధన్, వెలుగు​