పిల్లలు ఒంటరిగా పడుకోవాలంటే  భయపడుతున్నారా..? అయితే ఏం చేయాలంటే.

పిల్లలు ఒంటరిగా పడుకోవాలంటే  భయపడుతున్నారా..? అయితే ఏం చేయాలంటే.

కొంతమంది పిల్లలు ఒంటరిగా పడుకోవాలంటే  భయపడుతుంటారు. ఒకవేళ సముదాయించి నిద్రపుచ్చినా ఉలిక్కి పడి లేచి, బాగా ఏడుస్తుంటారు. ఇది పిల్లలున్న ప్రతి ఇంట్లో ఉండేదే. దీన్ని చూసీచూడనట్టు వదిలేస్తే.. పెద్దయ్యాక కూడా వాళ్లని ఆ భయం వదలదు. ఒంటరిగా పడుకోలేరు. ఈ సమస్య నుంచి పిల్లల్ని బయట పడేయా లంటే పేరెంట్స్​ కొన్ని టిప్స్​ ఫాలో అవ్వాలి. 

పిల్లలు ఒంటరిగా పడుకోలేకపోవడానికి గల కారణం ఏంటో పేరెంట్స్​ తెలుసుకోవాలి. మామూలుగానే చాలామంది పిల్లలకి చీకటి అంటే భయం ఉంటుంది. మొదట దాన్ని దూరం చేయాలి. రాత్రి, పగలు వెనక ఉన్న సైంటిఫిక్​ ఫ్యాక్టర్స్​ చెప్పి ఆ భయాన్ని కాస్త తగ్గించొచ్చు.
పిల్లలు ఒంటరిగా పడుకోలేకపోవడానికి పేరెంట్స్ కూడా ఒక కారణం.  చకచకా తినాలి...త్వరగా నిద్రపోవాలి. మారాం చేయకూడదు. చెప్పిన మాట వినాలి. లేదంటే దెయ్యం వస్తుంది. బూచోడికి పట్టిస్తా అంటూ భయపెడుతుంటారు. పేరెంట్స్ సరదాకే అన్నా ఆ పసి మనసుల్లో ఈ మాటలు బలంగా నాటుకుంటాయి. ఒంటరిగా

ఉంటే బూచోడు, దెయ్యం వస్తాయని భయపడతారు. రాత్రిళ్లు వాళ్లని ఊహించుకుంటారు. అందుకని పిల్లలకు లేని పోని భయాలు పెట్టొద్దు. హారర్​​, క్రైమ్​ సినిమాల్లో రాత్రిని ఒక డేంజర్​ బెల్​లా చూపిస్తుంటారు. దాంతో రాత్రంటే భయం పట్టుకుంటుంది  పిల్లలకి. అందుకే వాళ్లని భయపెట్టే సినిమాలు, సీరియల్స్​ ఇంట్లో పెట్టకూడదు. భయం కలిగించే మాటలకు కూడా దూరంగా ఉంచాలి. ఒకవేళ పిల్లలు హారర్​ సినిమాలు చూస్తే.. అందులో చూపించేదంతా ఫిక్షన్​ అని అర్థమయ్యేలా చెప్పాలి. అలాగే  వాళ్లకి  పీడ కలలు ఏమైనా వస్తుంటే ‘‘అది కల మాత్రమే. ఏమీ కాదు’’ అని చెప్పాలి.  అప్పుడే పిల్లలు ధైర్యంగా పడుకుంటారు. 
 - కొందరు పిల్లలు తమకు వచ్చిన కలల గురించి చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు వాళ్ల మాటలకు అడ్డుపడకూడదు. వాళ్లు చెప్పేది ఓపికగా వినాలి. ఆ కలలే తరచూ వస్తున్నాయేమో అడగాలి. ఎందుకంటే, పిల్లల్లో ఉండే భయాలే వాళ్లకి  కలల రూపంలో వస్తుంటాయి. అందుకే వాళ్లకెలాంటి కల వచ్చిందో తెలుసుకుంటే వాళ్ల భయాల గురించి కూడా తెలుస్తుంది. దాని ద్వారా వాళ్లు ఒంటరిగా ఎందుకు పడుకోలేకపోతున్నారో అర్థం అవుతుంది. 
  రాత్రి పడుకునే ముందు కథలు చెప్పమనడం పిల్లలకు ఓ సరదా. అలాంటప్పుడు  మాయలు, మంత్రాలు, దెయ్యాల కథలు చెప్తుంటారు కొందరు పేరెంట్స్​. ఇలాంటివి పిల్లల్ని పిరికి వాళ్లుగా మారుస్తాయి. నీడను చూసినా భయపడతారు.  అందుకే అలాంటి కథలు కాకుండా హాయిగా నిద్రలోకి జారుకునే కథలు చెప్పాలి.